టెక్సాస్‌లోని ఓ షాపింగ్ సెంటర్ పార్కింగ్ స్థలంలో చిన్న విమానం కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ షాపింగ్ సెంటర్ సమీపంలో ప్రమాదం జరిగింది. చిన్న విమానం కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం టెక్సాస్‌లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.
టెక్సాస్‌లోని ప్లానోలోని షాపింగ్ సెంటర్ పార్కింగ్ స్థలంలో ఒక చిన్న విమానం (సింగిల్ ఇంజన్ మూనీ M20) అకస్మాత్తుగా కూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు పైలట్‌గా గుర్తించారు. అంతేకాకుండా పార్కింగ్‌లో ఉన్న కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి.
ఇదిలా ఉండగా, ఘటనాస్థలికి కొద్ది దూరంలో విమానాశ్రయం ఉంది. అయితే ఈ ప్రమాదం టేకాఫ్ సమయంలో జరిగిందా లేదా ల్యాండింగ్ సమయంలో జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల టెక్సాస్‌లోని మెకిన్నేలో ఓబులి లాన్సర్ ప్రాప్‌జెట్ విమానం రన్‌వేపై నుంచి వెళ్లి రోడ్డుపై ఉన్న కారును ఢీకొన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అమెరికాలో చిన్నపాటి విమాన ప్రమాదాల సంఖ్య భారీగానే నమోదవుతోంది.
2019లో 988 ప్రమాదాలు జరగ్గా.. 307 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 939 ప్రమాదాలు జరగగా 268 మంది మరణించారు. రన్ వే ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోవడం ప్రమాదాలకు ప్రధాన కారణం.
Discussion about this post