గుంతకల్లు రూరల్‌లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం దంచర్లకు చెందిన ఆంజనేయులు(52), పాతకొత్తచెరువుకు చెందిన బాలకృష్ణ ఇద్దరూ గొర్రెల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నారు.
ఆదివారం రాత్రి తమ తండా వైపు వెళ్తుండగా పాతకొత్తచెరువు దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఢీకొనడంతో ఆంజనేయులు, బాలకృష్ణ రోడ్డుపై పడిపోయారు.
దురదృష్టవశాత్తు ఆంజనేయులు తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, బాలకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రెండో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఆంజనేయులుకు భార్య మహాలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పారిపోయిన డ్రైవర్ బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Discussion about this post