యశ్వంతపుర నుంచి కరటగ్గికి వెళ్లాల్సిన రైలు హోసపేటలో ముగుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి యశ్వంతపురం నుంచి బయల్దేరిన 16545 రైలును రాయదుర్గం మీదుగా కరటగ్గికి కొనసాగించకుండా హోసపేటలో నిలిపివేశారు.
గురువారం హోసపేట నుంచి రాయదుర్గం మీదుగా యశ్వంతపురానికి వెళ్తుంది. స్టేషన్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపిన ప్రకారం, కరటగ్గి మరియు హోసపేట మధ్య ట్రాక్ మరమ్మతుల వల్ల ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి.
Discussion about this post