స్వామి వివేకానంద ఒకసారి మద్రాసు వచ్చారు. అక్కడ న్యాయ కళాశాలలో వసతి కల్పించారు. వసతి గృహంలోని అన్ని గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. ఓ గదిలో గోడపై ఉన్న చిత్రాన్ని చూస్తుండగా అక్కడున్న ఓ విద్యార్థి ‘కృష్ణుడు నీలం రంగులో ఎందుకు ఉంటాడో తెలుసా?’
వెంటనే విద్యార్థి, ‘సముద్రం, ఆకాశం రెండూ అనంతమైనవి. రెండూ నీలం రంగులో ఉంటాయి. శ్రీకృష్ణుడు మరియు శ్రీరాముడు అనంతుడని సూచించడానికి స్వామి వారి జుట్టు రంగు నీలం అని బదులిచ్చారు.
ఆ మాటలు విన్న వివేకానందుడు చిరునవ్వు నవ్వి, ‘నీలో చురుకుదనం ఉంది. నీకు జగద్విఖ్యాతి కలుగుతుందని దీవించాడు.
స్వామి వివేకానందను మెప్పించిన ఆ కుర్రాడు మరెవరో కాదు.. అందరిచేతా ఆప్యాయంగా ‘రాజాజీ’ అని పిలిపించుకున్న చక్రవర్తుల రాజగోపాలాచారి.
Discussion about this post