అనంతపురం మెడికల్:
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి అన్నారు. శుక్రవారం మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియాబేగం, హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం తదితరులతో కలిసి జీజీహెచ్‌లో చేరిన బాలికను పరామర్శించారు.
మైనర్‌తో పాటు ఆమె తల్లితో ఎమ్మెల్యే మాట్లాడారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యజమానుల ఇంట్లో తన బిడ్డ అనుభవించిన నరకాన్ని బాధితురాలి తల్లి ఎమ్మెల్యేకు వివరించారు. భయపడే ప్రసక్తే లేదని, అందరూ మీ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం వైద్యులను కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ బాలిక పరిస్థితి హృదయ విదారకంగా ఉందని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఆడపిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బాలిక ఘటనను తెలుగుదేశం, జనసేన పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని మేయర్ వసీం, మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియాబేగం, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గైసుల్ ఆజం అన్నారు.
రాష్ట్ర మైనార్టీ సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌గర్ రిజ్వాన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఫయాజ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, కార్పొరేటర్లు ఇషాక్, బాబా, నాయకులు కృష్ణవేణి, మునీరా, కమర్తాజ్, ఖాజా, వేమల నదీం, తానీషా, రఫీ, నియాజ్ పాల్గొన్నారు. ఒక కార్యక్రమం. తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post