స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు.
దుబాయ్: స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ (791 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో, రోహిత్ (769) నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. శుభ్‌మన్ గిల్ (826) నెం.1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
బాబర్ ఆజం (824- పాకిస్థాన్) రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 3వ ర్యాంక్, జస్ప్రీత్ బుమ్రా 4వ ర్యాంక్, కుల్దీప్ యాదవ్ 6వ ర్యాంక్, మహ్మద్ షమీ 10వ ర్యాంక్‌లో నిలిచారు.
Discussion about this post