అనంతపురం ఆదర్శ నగర్‌లోని బేస్తవారి కల్యాణ మంటపం వద్ద ఎపి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ సూచన మేరకు ప్రగతి కోసం ఐక్యతను చాటుతూ ఆదివారం బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం, కార్తీక వనభోజనాల సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆలూరు లక్ష్మీనరసింహశాస్త్రి నాయకత్వం వహించగా, దుర్గాప్రసాద్, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఆర్‌కె శేషగిరిరావు, కోశాధికారి మనోహర్, అధికార ప్రతినిధి నార్పల మారుతి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గాయత్రి, ఇతర అతిధులు పాల్గొన్నారు.
మతోన్మాద విభేదాలను పక్కనబెట్టి సంఘటితంగా ఉద్యమించాలని దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. మంత్రోచ్ఛరణల మధ్య రుద్రాభిషేకం, అక్షర కోటి గాయత్రీ జపం, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర నాయకులు అనంత, ప్రముఖ రంగస్థల కళాకారుడు వరప్రసాద్‌ను కూడా నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖులు సుంకేశుల సత్యనారాయణ, పట్నం విశ్వేశ్వరరావు, సీవీ మురళీధర్, కృష్ణమూర్తి, నాట్యాచార్యులు విశ్వనాథ్, పలువురు పాల్గొన్నారు.
Discussion about this post