నార్పల మండలం కేసేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నార్పలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు గౌతమ్, విష్ణు, అభిషేక్, రాజకుళ్లాయప్ప శుక్రవారం ఉదయం ఒకే ద్విచక్ర వాహనంపై ట్యూషన్‌కు బయలుదేరారు.
అయితే దురదృష్టవశాత్తు కేసేపల్లి సమీపంలోకి రాగానే నాయనపల్లి క్రాస్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది.
నార్పలకు చెందిన కుమ్మర నారాయణస్వామి కుమారుడు గౌతమ్(16), బొందలవాడకు చెందిన విష్ణు(16) అక్కడికక్కడే మృతి చెందారు.
అభిషేక్, రాజకుళ్లాయప్పలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విషాదంలో మునిగిపోవడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రమాదంపై ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Discussion about this post