సీఎం జగన్ తప్పుడు వాగ్దానాలతో విద్యార్థులను మోసం చేశారంటూ గురువారం అనంతపురం గ్రామీణం పోలీస్ స్టేషన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహం, జిల్లా అధ్యక్షుడు ధనుంజయనాయుడు ఫిర్యాదు చేశారు.
మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి వారు కోరుకున్న రంగాల్లో విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామని, ఎన్నికలొస్తే వారి చదువుకు ఎలాంటి ఖర్చులైనా భరిస్తానని హామీ ఇచ్చిన జగన్ తన హామీని నిలబెట్టుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత, బైజూస్‌లో అవినీతి కారణంగా రాష్ట్ర విద్యావ్యవస్థ పతనమైందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
గడిచిన నాలుగున్నరేళ్లలో 7.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి మారారని, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు.
పాఠశాల అభివృద్ధి సాకుతో ప్రభుత్వం రూ.3 వేల కోట్లు అవినీతికి పాల్పడుతోందని నాయకులు ఆరోపించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని సీఐ రామకృష్ణారెడ్డిని కోరారు.
దీంతో పాటు టీఎన్‌ఎస్‌ఎఫ్ ఎంపీపీ నియోజకవర్గ అధ్యక్షుడు కురుబ జగదీష్ హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దాఖలు సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడు వెంకటాపురం అభి, ప్రతినిధి ఎండీఎస్ అమన్, కార్యదర్శి మూర్తి ఉన్నారు.
Discussion about this post