అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అమిదాస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికృష్ణ(23) బీటెక్ చేశాడు. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.
ఉరవకొండ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అమిదాస్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికృష్ణ(23) బీటెక్ చేశాడు. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.
మూడేళ్లుగా 5.25 ఎకరాల్లో మిర్చి సాగు చేసినా పంట దిగుబడి ఆశాజనకంగా లేక నష్టపోతున్నారు. పెట్టుబడి నిమిత్తం ప్రైవేటుగా రూ.20 లక్షలు, బ్యాంకు నుంచి పంట రుణం కింద రూ.1.5 లక్షలు తీసుకున్నారు. కొన్నాళ్లుగా అప్పులు తీర్చమని అడిగే ఒత్తిడి భరించలేక ఆదివారం రాత్రి పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అర్థరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Discussion about this post