తాడిమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నీటి కొరత ఏర్పడడంతో 250 మంది విద్యార్థులు స్నానానికి మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డారు. గత నెల 15న ప్రచురితమైన ‘జగన్ మావయ్య…తాగునీరు లేదయ్య’ కథనానికి స్పందించిన అధికారులు బుధవారం మండల పరిషత్ నిధులతో పాఠశాల సమీపంలో బోరు వేయించి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కేజీబీవీ ఎస్‌ఓ వాణిశ్రీ మాట్లాడుతూ బోరు పుష్కలంగా నీరు అందిందని, విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి ఉపశమనం, ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
Discussion about this post