స్థానిక సిబి రోడ్‌లోని గోకుల్ లాడ్జిలో పేకాట ఆడుతున్న 11 మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ డిఎస్పీ హేమంత్ కుమార్ నివేదించారు.
ముందస్తు సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి లార్డిలో తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన వారిలో భాస్కర్ నాయక్, షేక్ ఫకృద్దీన్, రామలింగారెడ్డి, ఓబులేసు, ప్రభాకర్, మరో ఆరుగురు ఉన్నారు.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. తనిఖీల్లో ఎస్‌ఐలు రామకృష్ణ, ధరణిబాబు, వారి బృందం చురుగ్గా పాల్గొన్నారు.
Discussion about this post