ప్రశాంతి నిలయం:
సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే 42వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇప్పటికే పూర్తి చేసింది. స్నాతకోత్సవంలో 14 మంది అత్యుత్తమ పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు, 560 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
సత్యసాయి బాబా బోధించిన మానవతా విలువలు, ఆధ్యాత్మికతలను మేళవించి ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పేరుతో 1981లో మంచి విద్యావ్యవస్థను నెలకొల్పారు. తర్వాత సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది.
భారతీయ విద్యా విధానంలో ఎప్పటి నుంచో ఉన్న గురుకుల విద్యా విధానాన్ని మెరుగుపరిచి నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి నూతన గురుకుల విధానాన్ని అమలు చేసేందుకు సత్యసాయి విద్యావిధానాలను రూపొందించారు.
మానవతా విలువలు, ఆధ్యాత్మికత మరియు సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన సమీకృత విద్యను బోధిస్తూ, అత్యుత్తమ ఫలితాలతో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలగా నిలిచింది. నేటి విద్యా వ్యాపారంలో కూడా సత్యసాయి విద్యాసంస్థలు కేజీ నుంచి పీజీ వరకు నయాపైసా వసూలు చేయకుండా ప్రమాణాలతో కూడిన ఆదర్శ విద్యను అందిస్తున్నాయి. అందుకే సత్యసాయి విద్యాసంస్థలు విలువలకు నిలయమని పలువురు కీర్తించారు.
సత్యసాయి 98వ జయంతిలో భాగంగా సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ) 42వ స్నాతకోత్సవం బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.
Discussion about this post