గుత్తి రూరల్‌లో ప్రమాదవశాత్తు ఆటోపై నుంచి పడి బాలిక ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దవడుగూరు మండలం వెంకటంపల్లికి చెందిన మహ్మద్ బాషా తన కుటుంబంతో కలిసి గుత్తిలోని గాంధీనగర్‌కు మకాం మార్చాడు.
ఆటో నడపడంతో పాటు బేల్దారీ పనులతో కుటుంబాన్ని పోషించేవాడు. ప్రతి ఆదివారం అతను తన భార్య కుళ్లాయమ్మ, వారి కుమార్తె అలియా (8)తో కలిసి తన తల్లితో గడిపేందుకు స్వగ్రామానికి వచ్చేవాడు. అయితే ఈ నెల 3వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా అలియా బ్యాలెన్స్ తప్పి ఆటోపై నుంచి కిందపడడంతో విషాదం నెలకొంది.
వెంటనే అదే ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ తలకు బలమైన గాయం కావడంతో బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Discussion about this post