శింగనమల:
నార్పల మండలం గూగూడులో వెలిసిన కుళ్లాయిస్వామి సన్నిధిలో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి క్యాంపు కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు.
26న మహిళలకు ముగ్గుల పోటీలు, 27న కుళ్లైస్వామి గంధోత్సవం, పల్లకీ సేవ, 28న ఆంజినేయ స్వామికి పంచామృతాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం ఉంటాయన్నారు. 29న ఆధ్యాత్మిక ప్రవచనాలు, 30న హరికథా కలక్షప, డిసెంబర్ 1న పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన, 2న కోలాటం జరుగుతాయి. కార్యక్రమంలో ఈఓ శోభ, ఆలయ కమిటీ చైర్మన్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post