అనంతపురం క్రైం:
నగరంలోని పలు బంగారు నగల దుకాణాల్లో గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇలాహి, సయ్యద్, తాడిపత్రి నగల దుకాణాల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, రికార్డులను పరిశీలించారు.
రికార్డుల్లో తేడాలున్నాయని గుర్తించి లీగల్ మెట్రాలజీ చట్టం కింద షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు విజిలెన్స్ ఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ రామారావు, డీసీటీఓ విజయలక్ష్మి, తూనికలు, కొలతల శాఖ అధికారులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post