రాష్ట్రంలో జగన్ హయాంలో గుంతలను ఆంధ్ర ప్రదేశ్ అని పిలిచేవారని టీడీపీ-జనసేన నేతలు పేర్కొన్నారు. ‘గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
ఉమ్మడి అనంతలో టీడీపీ-జనసేన నేతల నిరసన
అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు) : రాష్ట్రంలో జగన్ హయాంలో గుంతలను ఆంధ్రప్రదేశ్‌గా పిలిచేవారని టీడీపీ-జనసేన నేతలు పేర్కొన్నారు. ‘గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
గుంతలమయమైన రోడ్లపై మోకాళ్లపై నిలబడి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇది అసమర్థ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జడన్ అస్తవ్యస్త పాలనతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని దుయ్యబట్టారు.
అనంతపురం అర్బన్, రాయదుర్గం, రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, పుట్టపర్తి, హిందూపురం, తాడిపత్రి, శింగనమల తదితర నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన పార్టీల ఇంచార్జ్‌లు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రెండోరోజు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని, ఇరువర్గాలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
Discussion about this post