అనంతపురం అర్బన్ : దేశరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పిన కలెక్టర్ గౌతమి.. సైనికులు, విశ్రాంత సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ట్రైఫోర్స్ జెండా దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో రూ.70 వేల విలువైన సాయుధ దళాల జెండా స్టిక్కర్లు, కారు అద్దాలను ఆమె ఆవిష్కరించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి జె.శ్రీనివాసులు, ఎస్‌ఎ గిరీష్, జెఎ బాబాఫక్రీద్దీన్, ఒఎస్ అనిల్ పాల్గొన్నారు.
ఉరవకొండ : స్థానిక లక్ష్మీనరసింహ కాలనీలో నివాసం ఉంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ విజయ్‌కుమార్ (39) సోమవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యం కారణంగా పది రోజులుగా హైదరాబాద్‌లో ఉద్యోగానికి సెలవు పెట్టారు. ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ అధికారులు ఉరవకొండకు చేరుకుని జవాన్ మృతదేహానికి సైనిక వందనం సమర్పించారు.
Discussion about this post