షష్ఠి మహోత్సవంలో భాగంగా భీమవరం శ్రీరామపురం కూడలిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం (సుబ్బరాయుడి గుడి)లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామివారి వర్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చి, స్వామివార్లను హంస వాహనంపై ఆలయ సమీపంలోని లోసరి పంటకాలువ మీదుగా తీసుకెళ్లారు. పెద్దసంఖ్యలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను తిలకించారు.
అదనంగా, సింగరాయపాలెం-చెవూరుపాలెం సెంటర్‌లో షష్ఠి మహోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి కళ్యాణ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామి, అమ్మవార్లను గ్రామ వీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ కనువిందు చేశారు. అత్యంత సుందరంగా అలంకరించిన రథాన్ని లాగేందుకు భక్తులు పోటెత్తడంతో కల్యాణ రథయాత్ర చూపరులకు ఆహ్లాదకరంగా మారింది.
Discussion about this post