పుట్టపర్తి:
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి, సీఐ శాంతిలాల్ ప్రభాకర్ కథనం ప్రకారం.. పుట్టపర్తి టౌన్ పరిధిలోని బ్రాహ్మణ పల్లికి చెందిన సురేంద్రరెడ్డి తన సోదరులతో కలిసి ఉన్న ఉమ్మడి ఆస్తిలో వాటా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు.
స్టాంప్ డ్యూటీ తగ్గించి రూ.50 వేలు లంచం ఇచ్చేందుకు సబ్ రిజిస్ట్రార్ డీల్ కుదుర్చుకున్నాడు. బుధవారం రాత్రి సురేంద్రరెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ కు రూ.10 వేలు, అతని భార్యకు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి అనంతపురం తరలించారు.
Discussion about this post