పుట్టపర్తి పట్టణం:
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
23న సత్యసాయి జయంతి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ఈనెల 22న పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపదిమూర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారని తెలిపారు.
ఆ రోజు ఎయిర్ ఫోర్స్ విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్తారని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి సమావేశ స్థలమైన సాయిహీరా సమావేశ మందిరం వద్ద ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.
డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. సత్యసాయి జయంతి ఉత్సవం ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి.
అంతకుముందు కలెక్టర్ అరుణ్ బాబు, డీఐజీలు అమ్మిరెడ్డి, రవిప్రకాశ్, ఎస్పీ మాధవరెడ్డి, అనంతపురం ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితరులు విమానాశ్రయం, ప్రశాంతి నిలయం పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Discussion about this post