అనంతపురం అర్బన్:
జిల్లాలో ఈ నెల 27 నుంచి నిర్వహించనున్న కుల గణనను సక్రమంగా నిర్వహించాలని సీపీఓ అశోక్ కుమార్ రెడ్డి, డీఎల్ డీఓ ఓబులమ్మ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, సహాయ సంక్షేమాధికారులకు కులాల సర్వేపై శిక్షణ ఇచ్చారు.
ఇంటింటికి సర్వే నిర్వహించే విధానం, పాటించాల్సిన నిబంధనలపై సీపీఓ, డీఎల్‌డీవోలకు అవగాహన కల్పించారు.
ఆర్థిక, సామాజిక, విద్యా జీవనోపాధి, జనాభా గణన చేపట్టాలి. ప్రతి కుటుంబాన్ని పక్కాగా సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మధుసూదన్‌రావు, గిరిజన సంక్షేమశాఖ అధికారి అన్నదొర, బీసీ సంక్షేమశాఖ అధికారి కుష్బూ కొఠారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post