యాడికి:
కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటరమణ, ఏఓ వాసు ప్రకాష్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం తెల్లవారుజామున యాడి సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
అధికారులను గుర్తించిన బొలెరో వాహనం డ్రైవర్, ఆపకుండా వేగంగా వెళ్లి వారిని తప్పించాడు. అనంతరం అధికారులు మరో వాహనంలో వెంబడించి యాడి సమీపంలో బొలెరోను పట్టుకున్నారు. తనిఖీ చేయగా బొలెరోలో 17.40 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వాహనాన్ని, బియ్యం రవాణా చేస్తున్న రవితేజరెడ్డి, యాగవింటి పరుశురాంలను పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి ధృవీకరించారు.
24లోగా సిలబస్ పూర్తి చేయాలి
అనంతపురం విద్య:
ఈ నెల 24 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటిలోగా అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆర్జేడీలు, డీఓఈలు, మండల విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
జిల్లాలోని డీఈవో నాగరాజు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ… ఏ పాఠశాలలోనైనా సిలబస్ పూర్తి కాకపోతే 24లోపు పూర్తి చేసి పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.
ట్యాబ్‌లలోని కంటెంట్ ఆధారంగా దాదాపు 50 శాతం మార్కులకు ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికీ ట్యాబ్‌లు ఎక్కడా ఓపెన్ కాకపోతే ఆయా పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలను తెలుసుకోవాలన్నారు.
తరగతి గదుల్లో IFPలు మరియు స్మార్ట్ టీవీలను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ విషయంలో ఇంకా కుంటిసాకులు చూపితే సహించేది లేదన్నారు.
Discussion about this post