ఎస్కేయూ : ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్ డిమాండ్ చేశారు. శనివారం డీఈవో నాగరాజుకు ఏపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
2023లో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టామని, 100 మందికి పైగా ఆంగ్ల ఉపాధ్యాయుల భర్తీ లేక అదే పాఠశాలలో కొనసాగుతున్నారని తెలిపారు. వారు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని, తక్షణం ఉపశమనం కల్పించాలని కోరారు. సంఘం ప్రతినిధులు అస్మత్బేగం, స్వర్ణలత, వెంకటేష్ పాల్గొన్నారు.
Discussion about this post