అనంతపురం అర్బన్:
ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ ఎల్ సీ)లో తిరస్కరణకు గురైన ఈవీఎంలను వెనక్కి పంపిస్తామని కలెక్టర్ గౌతమి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఎఫ్ ఎల్ సీలో 89 బ్యాలెట్ యూనిట్లు, 82 కంట్రోల్ యూనిట్లు, 218 వీవీ ప్యాట్ లు తిరస్కరణకు గురయ్యాయన్నారు.
వీటిని స్కాన్ చేసి పోలీసు రక్షణలో బెల్ కంపెనీకి పంపిస్తారు. ఈవీఎంల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోడౌన్ వద్ద పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, తహసీల్దార్ బాలకిషన్, ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
విశ్వకర్మ యోజన రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం:
అనంతపురం రూరల్:
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి జిల్లాలో ముస్లింలు, దూదేకులు, క్రైస్తవులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ కళాకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, చేతివృత్తులవారు, కొలిమి (కమ్మరి), బుట్టలు, చాపలు, పరకాలు (చాపలు), చెప్పులు కుట్టేవారు, దోబీ (వాషర్లు) ) , కుమ్మరులు, టైలర్లు, మేస్త్రీలు, క్షురకులు, కల్లుగీత కార్మికులు, బొమ్మల తయారీదారులు, దండలు తయారు చేసేవారు మరియు తాళాలు వేసే వారికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ పరికరాల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టిందని పేర్కొంది.
ఈ పథకం ద్వారా రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు 5 శాతం వడ్డీ (తిరిగి చెల్లించే పద్ధతి)తో బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఐదేళ్లలోపు పీఎంఈజీపీ, పీఎం ముద్ర వంటి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారు అనర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే వర్తించదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం www. pmvishwakarma.gov.in లేదా కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) ఇతర సమాచారం కోసం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
24న ‘దక్ అదాలత్’
అనంతపురం సిటీ:
తపాలా శాఖ అనంతపురం డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ పీఆర్వో ప్రమోద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తపాలా శాఖకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే 24వ తేదీలోగా డివిజనల్ కార్యాలయం, అనంతపురం అనే చిరునామాకు పోస్టల్ కవరు కవర్ ద్వారా లిఖితపూర్వకంగా పంపాలన్నారు. 24న ఉదయం 11 గంటల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోస్టల్ ఎస్పీ పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
Discussion about this post