అనంతపురం అర్బన్ : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఆప్షన్-3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ పీడీ నరసింహారెడ్డితో కలసి అధికారులతో ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో ఆప్షన్-3 కింద 13,884 ఇళ్లు నిర్మించామని, వీటిలో ఫౌండేషన్ లెవల్ లో 6,180, రూఫ్ లెవల్ లో 1,507, స్లాబ్ లెవల్ లో 1,108, మిగతావి వివిధ లెవెల్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. కూలీల సంఖ్యను పెంచి ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని ఆదేశించారు.
డిసెంబర్ 15లోగా పునాది స్థాయిలో ఉన్న ఇళ్లన్నింటిని ఆర్‌సి స్థాయికి తీసుకురావాలని, తాడిపత్రి నియోజకవర్గంలోని సజ్జలదిన్నె లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Discussion about this post