గుంతకల్లు ఉరవకొండ రోడ్డులోని ఆర్టీసీ డిపోలో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 108 క్వింటాళ్ల (216 బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలానికి చెందిన మధు, ఉరకుంట ఈషర్‌లను విజిలెన్స్ సీఐ సాయిప్రసాద్, గుంతకల్లు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
గుంతకల్లులోని ఉరవకొండ రోడ్డులో కర్ణాటకలోని తుమకూర్‌కు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడ్డారు. బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులకు అప్పగించినట్లు సుబ్బలక్ష్మి తెలిపారు.
Discussion about this post