డీఈడీ కోర్సు పూర్తి చేసిన తమను కళాశాల యాజమాన్యం మార్కుల మెమో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని విద్యార్థులు మెహద్ నవాజ్, సౌమ్య, నీలావతి, మెహర్ తదితరులు కలెక్టర్‌కు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని విజయభారతి డైట్ కళాశాలలో 2020-2022 బ్యాచ్‌లో 63 మంది డీఈడీ పూర్తి చేసినట్లు తెలిపారు. కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ వారే చెల్లించారు. బుక్కరాయసముద్రం పోస్టాఫీసుకు ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన మార్కుల మెమోలు వచ్చాయని తెలిపారు.
అక్కడికి వెళ్లి అడగ్గా కాలేజీ స్టాఫ్ ఒకరు వచ్చి అన్నీ తీసుకెళ్లారని చెప్పారు. కళాశాలను సంప్రదిస్తే ఒక్కొక్కరు రూ.35 వేలు చెల్లిస్తేనే మార్కుల మెమో ఇస్తామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు.
కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించి మార్కుల మెమో ఇవ్వాలని ఆదేశించారు.
Discussion about this post