రానున్న ఎన్నికలకు ముందు కళ్యాణదుర్గం గ్రామస్థాయి నుంచి పార్టీ పునాదులను మరింత పటిష్టం చేయాలని భాజపా కార్యకర్తలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు కోరారు.
బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.
పార్టీ ప్రముఖులు అంకాల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చిరంజీవిరెడ్డి, వసుంధరమ్మ, లలితకుమార్, రత్నమయ్యతో పాటు స్థానిక నాయకులు బంగారు మల్లారెడ్డి, ముప్పూరి దేవరాజ్, చెక్కా సుబ్రహ్మణ్యం, గంగాధర్, తలారి సోము, ఆదినారాయణ, ఆంజనేయులు, నంజుండరావు, తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం.
Discussion about this post