ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలని పీఆర్‌టీయూ, వైఎస్‌ఆర్‌టీఎఫ్ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు.
సోమవారం విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన సమావేశానికి రాష్ట్ర, జిల్లా నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, పీవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, సురేందర్, తదితరులు హాజరయ్యారు.
పెండింగ్ బకాయిలు తీర్చాలని, పీఎఫ్ రుణాలు, మెడికల్ బిల్లు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాలని, 12వ పీఆర్‌సీని జాప్యం లేకుండా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, కల్పలతారెడ్డి, అప్పిరెడ్డిలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
Discussion about this post