కార్తీక మాస అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం రాత్రి రాయదుర్గంటౌన్‌లోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం, జంభుకేశ్వరస్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణోత్సవం వైభవంగా జరిగాయి.
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కాపు భారతి దంపతులు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయం, జంబుకేశ్వరస్వామి ఆలయంలో జరిగిన లక్ష దీపోత్సవానికి భక్తులు తరలివచ్చారు.
అనంతరం జ్వాలా తోరణం, సహస్ర నామార్చన, ఆకాశ జ్యోతి కార్యక్రమాలతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయం, బసవ నాగలింగేశ్వరస్వామి ఆలయం, చన్నవీరస్వామి ఆలయంలో అమావాస్య దీపోత్సవాన్ని నిర్వహించారు.
Discussion about this post