కోరాడ సర్వేశ్వరరావు, శ్రీకాకుళం నియోజకవర్గం, జనవరి 7: ఈ నెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువత భవిత కోసం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం నియోజకవర్గ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి, విద్యావకాశాలు లేక వలసలు పోతున్న విషయాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా యువశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. యువత వలసలు పోతున్నందుకు గల కారణాలు, ఉపాధి ఎలా కల్పిస్తే వలసలు అరికట్టవచ్చు అనే అంశంపై పవన్ సభలో మాట్లాడతారని తెలిపారు.
యువశక్తి బహిరంగ సభ కోసం శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న జనసేన పిఏసి సభ్యులు పంతం నానాజీ గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుండి పెద్ద సంఖ్యలో యువత ఉపాధి లేక వలసలు పోతున్నారని చెప్పారు. వలసలు అరికట్టాలన్నా, యువతకి ఉపాధి అవకాశాలు లభించాలన్నా, విద్యా వైద్యం సక్రమంగా అందలన్నా జనసేన ప్రభుత్వం తోనే సాధ్యమని తెలిపారు. యువశక్తి సభ తరువాత రాష్ట్రంలో పరిస్థితులు మారనున్నాయని , జనసేన పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టనున్నారని జోస్యం చెప్పారు. యువశక్తి కార్యక్రమ విశిష్ఠతను నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.సమావేశంలో శ్రీకాకుళం IT వింగ్ కోఆర్డినేటర్ విష్ణు ప్రియాంక నియోజకవర్గ జనసేన నాయకులు గురు ప్రసాద్ గౌడ్, ఉదయ్, వెంకి పట్నాయక్, ప్రదీప్, రఫీ, కమేష్, మధు, వెంకీ మదు, సాయి తదితరులు పాల్గొన్నారు.
Korada Srinivas Rao-Srikakulam district-Janasenaparty-MLA-Andhra Pradesh
Discussion about this post