విడపనకల్లు మండలం హవలిగిలో జరుగుతున్న కడ్లె గౌరమ్మ పూల రథోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గౌరీదేవి ప్రతిమను ఎడ్లబండిపై ఉంచి మంగళవాయిద్యాలు, డప్పువాయిద్యాలతో ఊరేగించారు.
గౌరీదేవి పూల రథం ముందు మహిళలు, యువతులు 101 కలశాలతో హారతి నిర్వహించారు. పాల్తూరు, గాజుల మల్లాపురం, ఉండబండ, కరకముక్కల, విడపనకల్లుతో పాటు కర్ణాటకలోని రూపనగుడి, శంకరబండ, గణేష్‌నగర్, కమ్మరచేడు, బళ్లారి, ఉరవకొండ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు గణనీయమైన సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలోని చెరువులో కడ్లె గౌరమ్మను నిమజ్జనం చేశారు.
Discussion about this post