అనంతపురం:
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 21న అనంతపురం శివారులోని ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
MSN లేబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. 2022, 2023లో ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ పూర్తిచేసిన వారు అర్హులు. కంపెనీలో ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 91820 63878, 91548 29055 నంబర్లలో సంప్రదించవచ్చు.
Discussion about this post