అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాయువ్య దిశలో గంటకు 8 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా వరి కోతలు, పంట ఉత్పత్తులను సురక్షిత నిల్వకు చర్యలు తీసుకోవాలన్నారు. అరటి, టమాటా వంటి పంటలు దెబ్బతినకుండా కట్టెలతో ఊతం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఏపీలోని అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం వారి అనధికారిక సంస్కృత విద్యా శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వీ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వీవీఎన్ రాజేంద్రప్రసాద్ సంస్కృత భాషలో వేదాంత శాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాల ప్రత్యేకతలను వివరించారు. ప్రొ.విశాల్ ప్రసాద్ భట్, సంస్కృత భారతి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు జె.కుమార్ చంద్రశేఖర్ తదితరులు అనధికారిక అధ్యయన కేంద్రం గురించి తెలియజేశారు.
ఆత్మకూరు పంపనూరులోని సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ అక్కిరెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం దామోదర కల్యాణోత్సవం, పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం కోటి దీపోత్సవం ఉంటుంది.
Discussion about this post