శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షిపై ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్జేడీ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టారు.
కొత్తచెరువు: శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షిపై ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఆర్జేడీ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై డీఈవో ఒత్తిడి తెచ్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కమిషనర్ కు ఫిర్యాదు అందింది.
దీనిపై విచారణ జరిపి నివేదిక పంపాలని ఆర్జేడీని కమిషనర్ ఆదేశించారు. దీంతోపాటు మంగళవారం కోటచెరువులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆర్జేడీ కార్యాలయ ఏడీ అరుణ్ కుమార్, సూపరింటెండెంట్ బాబునాయక్ సంయుక్తంగా విచారణ చేపట్టారు.
డీఈవో, కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విచారణకు హాజరుకాగా, ఫిర్యాదుదారులు గైర్హాజరయ్యారు. అధికారులు వారితో ఫోన్‌లో మాట్లాడారు. శనివారం ఆర్జేడీ కార్యాలయానికి వచ్చి నేరుగా ఆధారాలు అందజేస్తామని దర్యాప్తు అధికారి ఏడీ అరుణ్‌కుమార్ తెలిపారు. నివేదికను కమిషనర్ కార్యాలయానికి పంపుతామని తెలిపారు.
డీఈవో ఎలాంటి తప్పు చేయలేదని ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో విచారణ అధికారులకు వినతిపత్రం ఇవ్వడంపై పలు విమర్శలున్నాయి.
Discussion about this post