రైల్వేస్టేషన్ కన్సల్టెంట్ కమిటీ డివిజనల్ మరియు స్టేషన్ కమిటీ ప్రతినిధులు అనంతపురం రైల్వేస్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని ఉద్ఘాటించారు.
స్టేషన్ మేనేజర్ అశోక్, ఆర్పీఎఫ్ ఏఎస్సై ప్రతాప్ నాయక్, విభాగాధిపతులు, కమిటీ సభ్యులు రవీంద్రనాథరెడ్డి, కృష్ణమూర్తి, ఆళ్లగడ్డ రాము, శ్రీనివాసులు, శివనారాయణశెట్టి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనాలు, కార్యాలయాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
స్టేషన్ విస్తరణ పనులు మందకొడిగా సాగడం, బాత్‌రూమ్‌లలో తాగునీటి కనెక్షన్లు లేకపోవడం, ప్రయాణికులకు కూర్చునే బెంచీలు లేకపోవడం, రాత్రిపూట వెలుతురు సరిగా లేకపోవడం వంటి కారణాలపై కమిటీ నేరుగా విచారణ జరిపింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Discussion about this post