నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్
దీనిపై దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది
భార్యను మోసం చేసి ఆపై బెదిరించిన కానిస్టేబుల్, అతని కుటుంబ సభ్యులపై అనంతపురం ‘దిశ’ పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. సీఐ చిన్నగోవిందు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని ఓ పెళ్లికాని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె పనిచేస్తోంది.
ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించాడు. తర్వాత పెళ్లి చేసుకోకుండా పారిపోయాడు. బాధితురాలు 2020లో దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆ సమయంలో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. నిందితులు, అతని తల్లిదండ్రులు, బంధువులు కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌కు ‘స్పందన’ కార్యక్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
దిశ డీఎస్పీ ఆంటోనప్ప ఆదేశాల మేరకు సీఐ చిన్నగోవిందు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితులపై మోసం, బెదిరింపు కేసులు నమోదు చేశారు.
Discussion about this post