రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని హిందూపురం పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయూబ్ గారు “good morning సత్యనారాయణ” పేట అనే కార్యక్రమం ద్వారా వార్డు ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని మరియూ వార్డు సచివాలయం సిబ్బంది పనితీరును తెల్సుకొన్నారు.వార్డు ప్రజలు కౌన్సిలర్ అయూబ్ తో మాట్లాడుతు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఇంటి దగ్గరకే వాలంటీర్లు వచ్చి పథకాల గురించి చెప్పి మాకు అర్హత ఉన్న పథకాలకు దరఖాస్తు చెపిస్తున్నారని,అంతే గాక 1వ తేదిన తెల్లవారు జామునే వచ్చి మాకు పింఛనిస్తున్నారని వృద్యప్య పించన్ తీసుకునే వారు కన్నీటి పర్యంతం అయ్యరు.
కౌన్సిలర్ అయూబ్ గారు వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించి ఎన్నికలలో “ఎమ్మెల్యే అభ్యర్థి ఆయిన మా చెల్లెల్లు దీపికమ్మకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మకు” రెండు ఓట్లు వేసి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
Discussion about this post