ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక నియోజకవర్గం. హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఇది ఒకటి.
వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో 19,172 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై 14,211 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యాడు.
వరదాపురం సూరి 2019లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో 15,666 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 జూన్ 28న తెలుగుదేశం పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.
Gonuguntla Suryanarayana – MLA – TDP – Dharmavaram Constituency – Sri Sathya Sai District – Andhra Pradesh
Discussion about this post