గుంతకల్లు పట్టణంలోని పట్టణవాసులకు ఇసుకను సరఫరా చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు శనివారం మార్కెట్ యార్డులోని స్టాక్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, పట్టణ సహాయ కార్యదర్శి గౌస్, కార్యకర్తలు ఇసుక డంప్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా ఇసుక సరఫరా నిలిచిపోయిందని, దీంతో ప్రజలు, నిర్మాణ పనులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Discussion about this post