మండలంలోని హొట్టెబెట్ట పంచాయతీలో ఉపాధి హామీ పథకం క్షేత్ర పరిశీలకులుగా నియమితులైన నరసింహమూర్తి గురువారం మడకశిరలో జరిగిన బీసీ సామాజిక సాధికారత బస్సుయాత్ర సభలో వైకాపా జెండాను ప్రదర్శించి పాల్గొన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాల్సిన క్షేత్రస్థాయి పరిశీలకుడు పార్టీ జెండాలతోనే సభలో పాల్గొనడంపై స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
Discussion about this post