యల్లనూరు:
యల్లనూరు మండలం గొడ్డుమర్రిలో జరిగిన ఈ విషాద ఘటనలో కౌలు రైతు రమేష్ (29) విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. గొడ్డుమర్రికి చెందిన వెంకటకృష్ణారెడ్డి మూడెకరాల పొలంలో దానిమ్మ చెట్లను పెంచుతున్నాడు. కప్పల రమేష్ గత ఐదేళ్లుగా ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు.
శుక్రవారం దానిమ్మ చెట్లకు నీరు పోస్తూ మోటారు స్విచ్ ఆన్ చేశాడు. విద్యుత్ స్తంభానికి మోటారు వైర్లను అనుసంధానం చేసే క్రమంలో ఓ వైర్ జారి రమేష్ ఛాతిపై పడింది. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
భార్య సాత్విక, కుమారులు ఆకాష్, రణదీప్, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
Discussion about this post