వేతనాలు సకాలంలో అందకపోవడం, పాత పింఛన్ విధానం అమలుకు నోచుకోకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని ఫ్యాప్టో హెచ్చరించింది.
సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ భవన్‌లో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సూర్య, లింగమూర్తి, కోటేశ్వరప్ప, రమణారెడ్డి, లింగమయ్య, బాలమురళీకృష్ణ, అక్కులప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ప్రభుత్వం తగు విధంగా స్పందించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరాశకు లోనుకావద్దని సూచించారు.
ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు అందజేయాలని, సీపీఎస్, జీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ వంటి కీలకమైన డిమాండ్‌లను సమావేశంలో ప్రస్తావించారు.
Discussion about this post