కళ్యాణదుర్గం:
ఆర్డీటీ మహిళా సాధికారత డైరెక్టర్ విసాలాఫెరర్ మాట్లాడుతూ ప్రతి మహిళ తన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని, స్వయం ఉపాధి ద్వారా కోటీశ్వరులు కావాలన్నారు. కళ్యాణదుర్గంలో అన్నేఫెరర్ మహిళా మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ యూనియన్ లిమిటెడ్ బ్యాంకును ఆర్డీటీ రీజియన్ డైరెక్టర్ సుబ్బారావుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు.
మహిళలు సొంతంగా బ్యాంకు ఏర్పాటు చేసుకోవడం గర్వించదగ్గ విషయం. కళ్యాణదుర్గం మండలంలోని 48 గ్రామాల మహిళలను ఏకం చేసి తొలిసారిగా మహిళా బ్యాంకును ప్రారంభించినట్లు వివరించారు.
కళ్యాణదుర్గంలోనే తొలిసారిగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే పైలట్ ప్రాజెక్టుగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ బ్యాంకులో మహిళలు డైరెక్టర్ల బోర్డుగా ఉంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీతో కార్యకలాపాలు కొనసాగిస్తారు. కార్యక్రమంలో ఏటీఎల్ లు మీనాక్షి, సురేంద్ర, నారాయణస్వామి, బాషా, ఎస్ టీఎల్ సూర్యనారాయణ, నారాయణస్వామి, కృష్ణయ్య పాల్గొన్నారు.
Discussion about this post