అనంతపురం అర్బన్:
కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మత్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. చేపల పెంపకానికి అవసరమైన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
రైతులు ముందుకు వస్తే మరిన్ని మినీ చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యశాఖ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రస్తుతం చేపలు, రొయ్యలకు మంచి గిరాకీ ఉంది.
అందుకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్ రూ.కోటి విలువైన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. 75 వేలు – ఆరుగురు లబ్ధిదారులకు 40 శాతం సబ్సిడీతో ఐస్‌బాక్స్.
చిన్న తరహా చేపల మార్కెట్‌ను నిర్వహిస్తున్న లబ్ధిదారులను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఎఫ్‌డీఓలు ఆసిఫ్, లక్ష్మీనారాయణ, ఫక్కీరప్ప, పెద్దబాబునాయుడు, సిబ్బంది షెహింఖాన్, మత్స్య సహకార సంఘాల మాజీ అధ్యక్షుడు అంకె పోతన్న, బాల నరసింహులు, గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు.
Discussion about this post