జిల్లాలో తీవ్ర కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు స్పందించలేదని సిపిఎం జిల్లా కమిటీ విమర్శించింది.
ఆజాద్ నగర్ (అనంతపురం): జిల్లాలో తీవ్ర కరువు విలయతాండవం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు స్పందించడం లేదని సీపీఎం జిల్లా కమిటీ విమర్శించింది. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ.. 33 శాతానికి మించి పంటనష్టం వాటిల్లితేనే పరిహారం అందుతుందన్న నిబంధనలు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.
లక్షా ఎనభై ఆరు వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేసినా వాస్తవానికి ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు 200 రోజులు ఉపాధి, రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అన్ని రకాల విద్యార్థుల ఫీజులను మాఫీ చేయాలి. సిపిఎం చేపట్టిన ఆందోళనల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, బాలరంగయ్య, నాగేంద్ర, శ్రీనివాస్ ఉన్నారు.
Discussion about this post