గుంతకల్లు టౌన్‌లో కబడ్డీ క్రీడాకారులను ఆదుకోవాలని, రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీరలంకయ్య, రాష్ట్ర కోశాధికారి మంజులవెంకటేష్ వాణిని వినిపించారు.
గుంతకల్లు పట్టణంలోని ఇల్లూరు గోపాలకృష్ణ భవనంలో జిల్లా కబడ్డీ సంఘం ఎన్నికల కోసం ఆదివారం జరిగిన సాధారణ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒ
లంపిక్ జిల్లా పరిశీలకుడు శ్రీనివాసులు, కబడ్డీ పరిశీలకుడు జనార్దన్, రిటర్నింగ్ అధికారి న్యాయవాది కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అధ్యక్షుడిగా రామ్‌తేజ్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా రామయ్య, ఉప కార్యదర్శిగా మల్లికార్జున, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంపత్‌కుమార్, అంజున్‌బాయి తదితరులున్నారు. ఎన్నికల అనంతరం నూతనంగా నియమితులైన సభ్యులను సమావేశంలో సన్మానించారు.
Discussion about this post