కదిరిలో గాండ్లపెంట మండలం పెద్దతండాకు చెందిన శ్రీనివాసులునాయక్ చిన్నారుల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీనివాస్ నాయక్, విజయకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు నల్లమాడ మండలం ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ధనుష్ నాయక్, 5వ తరగతి చదువుతున్న శశాంక్ నాయక్.
వారాంతపు సెలవుల అనంతరం పిల్లలను తిరిగి ఆశ్రమ పాఠశాలకు పంపాలని భావించి ఈ నెల 12న తల్లిదండ్రులు కదిరి బస్టాండ్‌కు చేరుకున్నారు. పాఠశాలకు వెళతామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు వారిని బస్టాండ్‌లో వదిలి స్వగ్రామానికి చేరుకున్నారు.
పిల్లల రాక గురించి పాఠశాల ఉపాధ్యాయుడిని సంప్రదించగా, వారు పాఠశాలకు చేరుకోలేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
చుట్టుపక్కల వెతికినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి ధృవీకరించారు. విద్యార్థుల ఆచూకీ తెలిసిన వారు 94407 96851 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Discussion about this post