జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరైన మెళకువలు పాటించడం ద్వారా మామిడి దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు.
గురువారం స్థానిక ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లో మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రఘునాథరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఎరువుల నిర్వహణ, సమర్ధవంతమైన నీటి వినియోగం, తేనెటీగ ఉధృతి, బూడిద తెగులు నివారణ, నులిపురుగుల నివారణ వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
నాణ్యమైన మామిడి దిగుబడిని పొందేందుకు అవసరమైన వివిధ నిర్వహణ పద్ధతులను ఆయన వివరించారు.
కార్యక్రమంలో మండల ఉద్యానశాఖ అధికారి గౌసియా, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతినిధి అలెన్ మాథ్యూ, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీరెడ్డి, సెక్టార్ టీమ్ లీడర్ రామకృష్ణ, ఎస్‌ఎంఎస్ నాగరూప, ఆర్డీటీ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Discussion about this post